గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం కొండపై కొలువైన కార్మెల్ మాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు 16వ తేదీతో ముగుస్తాయి. ఈ దేవత కోరిన కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. మాతను దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. మాతను కొలిస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే.. మెట్ల మార్గం నుంచి మోకాలు నడక ద్వారా పైకి చేరుకుని.. తలనీలాలు సమర్పిస్తారు.
వైభవంగా కార్మెల్ మాత ఉత్సవాలు - The Carmel Matha celebrations on the hill of Firangippuram
భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కార్మెల్ మాత ఉత్సవాలు... గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వైభవంగా జరుగుతున్నాయి.

వైభవంగా కార్మెల్ మాత ఉత్సవాలు