బాపట్ల మండలం కంటకపాలెంకు చెందిన జమ్ములపాలెం సొసైటీ సీఈఓ శ్రీనివాసరావు విధులు ముగించుకొని తన స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ద్విచక్రవాహనం... ఒకరు మృతి - బాపట్లో లాక్డౌన్ ప్రభావం
గుంటూరు జిల్లా బాపట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాన్ని ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి