ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు... రైతు మృతి - నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి

పొలంలో పనులు చేసుకోవడానికి ఆ రైతు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అంతలో ఓ కారు వెనకనుంచి వేగంగా దూసుకొచ్చింది. ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. రైతు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పెద్దదిక్కును పోగొట్టుకున్న ఆయన కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. అతివేగం ఎంత విషాదాన్ని మిగిలిస్తుందో తెలిపే ఈ ఘటన గుంటూరు జిల్లా నార్కట్ పల్లి -అద్దంకి రోడ్డుపై జరిగింది.

farmer died at rompicharla guntur
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు

By

Published : Nov 8, 2020, 7:58 PM IST

గుంటూరు జిల్లా నార్కట్​పల్లి-అద్దంకి ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెంకు చెందిన బత్తుల చిన్నయ్య అనే రైతు ద్విచక్ర వాహనంపై పొలానికి వెళుతుండగా వెనకనుంచి కారు ఢీకొట్టింది. రహదారిపై పడిపోవటంతో రైతుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన కారును వెంబడించి పట్టుకున్నారు. డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆసుపత్రికి చేరుకుని రైతు కుటుంబాన్ని పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details