The state is top of the country in debt: అప్పుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలానికి ఏ రాష్ట్రమూ తీసుకోని రుణాలను ఆంధ్ర ప్రదేశ్ తీసుకుంది. ప్రతి నెలా కాగ్ వెలువరించే లెక్కల ఆధారంగా ఈ విషయం తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం మీద 48,724.12 కోట్ల రుణం అవసరమవుతుందని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. సెప్టెంబరు నెలాఖరు వరకు ఏకంగా 49,263.34 కోట్ల రుణాన్ని రాష్ట్రం వినియోగించుకుంది.
బిహార్ ఒక్కటే ఏడాది మొత్తం మీద 25,885.10 కోట్ల రుణం అవసరమవుతుందని ప్రతిపాదించి.. తొలి 6 నెలల్లో 30,407.14 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా ప్రతిపాదిత అప్పు, వినియోగించిన అప్పు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. తమిళనాడు 96,613.71 కోట్ల రుణం అవసరమని ప్రతిపాదించి ఇంతవరకు 18,726.34 కోట్లే అప్పు రూపంలో ఖర్చు చేసింది. కర్ణాటక, తెలంగాణ.. ఇలా అనేక రాష్ట్రాలు ఈ స్థాయి అప్పులు చేయలేదు.