ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈతకు దిగి.. క్వారీ గుంతలో బాలుడు గల్లంతు - గుంటూరులో ఈతకు వెళ్లి గల్లంతు తాజా వార్తలు

మిత్రుడితో కలిసి ఈత కొట్టేందుకు క్వారీ గుంతలో దిగిన బాలుడు గల్లంతైన ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో జరిగింది. గజ ఈతగాళ్ల సాయంతో గాలించినా.. బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు.

the-boy-fell-into-a-quarry
ఈతకు దిగి క్వారీ గుంతలో బాలుడు గల్లంతు

By

Published : Sep 17, 2020, 8:54 AM IST

సరదాగా ఈత కొడదామని మిత్రుడితో కలిసి క్వారీ గుంతలో దిగిన బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో జరిగింది. నగరంలోని గాంధీ బొమ్మల వీధికి చెందిన మిట్ట యశ్వంత్, కాళిదాసు కోటీశ్వరరావు ఇద్దరు మిత్రులు. పేరేచర్లలోని క్వారీ గుంతలో ఈత కోసం ఇద్దరూ దిగారు.

నీటి ప్రవాహానికి అదుపు తప్పిన యశ్వంత్(15) మునిగిపోయాడు. మేడికొండూరు పోలీసులు సమాచారం అందుకోగా.. ఎస్సై నరహరి సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో క్వారీ గుంతలో గాలించారు. బాలుడి ఆచూకీ లభించకపోవడంపై కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details