గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ప్రవీణ్ కుమార్(12) అనే బాలుడు ప్రమాదవశాత్తు మంచినీటి చెరువులో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట మండలం పాలపాడు గ్రామానికి చెందిన బత్తుల అంకమ్మరావు, అరుణ దంపతుల కుమారుడు ప్రవీణ్ కుమార్. ఫిరంగిపురంలో అమ్మమ్మతో నివసిస్తున్నాడు. గ్రామంలోని పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి
స్నేహితులతో ఆడుకోటానికి వెళ్లిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. దాహంతో మంచినీటి చెరువు వద్దకు వెళ్లి.. ప్రమాదవశాత్తు అందులో పడి మరణించాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఈ ఘటన జరిగింది.
మృతి చెందిన బాలుడు
మిత్రులతో కలిసి ఆడుకునేందుకు.. సమీపాన ఉన్న మంచినీటి చెరువు వద్దకు వెళ్లాడు. దాహం వేసి నీరు తాగేందుకు చెరువులోకి దిగగా.. ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడ్డాడు. విషయం గమనించిన స్థానికులు.. నీట మునిగాడని గుర్తించి వెతికారు. అప్పటికే బాలుడు మరణించటంతో.. మృతదేహాన్ని వెలికి తీశారు. ఆడుకోటానికి వెళ్లిన బాలుడు విగత జీవిగా మారటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మునీరు అయ్యారు.
ఇదీ చదవండి:అమరావతి ఉద్యమంలో ఆగిన మరో రైతు గుండె