గుంటూరు జిల్లా తెనాలిలో వైద్య విద్యార్థి మరణించాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మారిస్ పేటకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి అమలాపురంలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. సెలవులు కావటంతో ఇటీవల ఇంటికి వచ్చాడు. సమీపంలోని సాగునీటి కాలువలో ఈత కోసం వెళ్లాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. పెదరావూరు వద్ద మృతదేహం బయటపడింది. కుటుంబానికి పేరు తెస్తాడనుకున్న కుమారుడు... ఇలా మరణించటంతో ఇంటిల్లిపాది తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
వైద్య విద్యార్థి హర్షవర్ధన్ రెడ్డి మృతదేహం లభ్యం - mediacal student death news
గుంటూరు జిల్లా తెనాలిలో వైద్య విద్యార్థి హర్షవర్ధన్ రెడ్డి కాలువలో పడి ప్రమాదవశాత్తు మరణించాడు. అతని మృతదేహం పెదరావూరు వద్ద లభ్యమైంది.
మృతి చెందిన విద్యార్థి పాతచిత్రం