గుంటూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అశ్లీల వీడియో కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ అమ్మి రెడ్డి తెలిపారు. మంగళగిరి, మంగళగిరి గ్రామీణ, తాడేపల్లి పోలీస్ స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. మత్తు పదార్థాల రవాణను అరికట్టేందుకు జిల్లా, కళాశాలల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థినుల రక్షణ కోసం మహిళ మిత్ర పేరుతో కమిటీలను నియమిస్తామన్నారు. రౌడీషీటర్లలో మార్పులు రాకపోతే నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. వరకట్న కేసులలో బాధితులకు న్యాయం చేసేందుకు దిశ పోలీస్ స్టేషన్ లలో ప్రత్యేక కౌన్సెలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
విద్యార్థిని అశ్లీల వీడియో కేసులో నిందితుల అరెస్టు
గుంటూరులో కలకలం సృష్టించిన విద్యార్థిని అశ్లీల వీడియోల కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ అమ్మిరాజు తెలిపారు. వారికి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ