ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోరాటం ఉద్ధృతం.. అరగుండు, అర మీసంతో నిరసనలు - tullur farmers aligation on amaravathi

అమరావతికి మద్దతుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. తుళ్లూరు, మందడం,పెనుమాకలో వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు.

రైతులు,పోలీసుల మధ్య వాగ్వాదం
రైతులు,పోలీసుల మధ్య వాగ్వాదం

By

Published : Dec 23, 2019, 9:11 AM IST

Updated : Dec 23, 2019, 9:30 AM IST

రాజధాని కోసం రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ మరింత ఉద్ధృతంగా నిరసనలు జరుగుతున్నాయి. తూళ్లురు, మందడం,పెనుమాకలో రైతులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. తూళ్లురులో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. టెంటు వేయకుండా రైతులను పోలీసులు అడ్డుకున్నారు.

అరగుండు, అర మీసంతో నిరసనలు

ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు వినూత్నంగా నిరసన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరగుండు, సగం మీసంతో ధర్నా చేస్తున్నారు. ద్విచక్రవాహనాల మీదుగా ర్యాలీలకు నిర్ణయించారు. నెమ్మదిగా.. ఈ ఆందోళనలు రాజధాని సమీప గ్రామాలకు విస్తరిస్తున్నాయి. అమరావతి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. మంగళగిరి, నిడమర్రు, బేతపూడిలో తెదేపా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నారు. అమరావతికి మద్దతుగా జిల్లా కోర్టులో విధులు బహిష్కరించి న్యాయవాదులు ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు.

Last Updated : Dec 23, 2019, 9:30 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details