గుంటూరు జిల్లాలో ఓ దుస్తుల వ్యాపారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. లింగంగుంట్లకు చెందిన అంజనంరాజు రొంపిచర్ల మండలం అన్నవరం వెళ్లి దుస్తులు అమ్ముకొని తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. ఇక్కుర్రు సమీపానికి చేరుకోగానే టిప్పర్ వేగంగా వచ్చి అతని ముందున్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. అది విరిగి అతని ద్విచక్ర వాహనంపై పడుతుండడాన్ని గమనించిన అంజనరరాజు అప్రమత్తమయ్యాడు. చాకచక్యంగా పక్కకు దూకేశాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై స్తంభం పడింది. త్రుటిలో అతనికి ప్రాణపాయం తప్పింది. బాధితుడి ఫిర్యాదుతో గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హఠాత్తుగా ప్రమాదం.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం - గుంటూరు జిల్లా తాజా వార్తలు
ద్విచక్రవాహనంపై ఊరురా తిరిగి దుస్తులు అమ్ముకుని స్వగ్రామానికి బయలుదేరాడు వ్యాపారి. అంతలోనే ఓ టిప్పర్ అతను వెళుతున్నదారిలోని స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. అది విరిగి వ్యాపారి వాహనంపై పడింది. ఆయన చాకచక్యంగా తప్పించుకున్నాడు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

త్రుటిలో తప్పిన ప్రాణాపాయం