గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని అందుగుల కొత్త పాలెం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. మార్కాపురం మీదగా వినుగొండ వైపు వెళ్తున్న బత్తాయి లోడ్ లారీ.. కర్నూలు వైపు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బత్తాయి లారీలోని క్లీనర్లు సురేశ్ తీవ్రంగా గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.