ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణదాతలకు ప్రత్యేక అభినందనలు - గుంటూరు జిల్లాలో లాక్​డౌన్ ప్రభావం

కోరలు చాస్తున్న కరోనా వైరస్ కట్టడికి అనుక్షణం శ్రమిస్తున్న సిబ్బందికి ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. గుంటూరులో కొవిడ్​తో పోరాడుతున్న సర్వజనాసుపత్రి వైద్య సిబ్బందిని రెడ్​క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అభినందించారు.

thankfull wishes meeting for guntur GGH doctors in guntur
వైద్య సిబ్బందికి నమస్కరిస్తున్న రెడ్​క్రాస్ సొసైటీ సభ్యులు

By

Published : May 5, 2020, 12:58 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుక్షణం సేవలందిస్తున్న గుంటూరు సర్వజనాస్పత్రి వైద్య సిబ్బందికి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. వారి సేవలను కొనియాడుతూ చప్పట్లు కొట్టారు.

పూలతో అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు పిలుపునిచ్చారు. వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా మార్చుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details