గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో థాంక్యూ సీఎం సార్ పేరుతో సచివాలయ ఉద్యోగులు కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ వ్యవస్థ ప్రథమవారికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రజని పాల్గొన్నారు.
'చిలుకలూరిపేటలో థాంక్యూ సీఎం సార్ కార్యక్రమం' - చిలకలూరిపేటలో థ్యాంక్ సీఎం సార్ కార్యక్రమం వార్తలు
వార్డు సచివాలయ వ్యవస్థ ప్రథమ వారికోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట సచివాలయ సిబ్బంది ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో థాంక్యూ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
!['చిలుకలూరిపేటలో థాంక్యూ సీఎం సార్ కార్యక్రమం' 'చిలుకలూరిపేటలో థ్యాంక్ సీఎం సార్ కార్యక్రమం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9294002-950-9294002-1603524694333.jpg)
'చిలుకలూరిపేటలో థ్యాంక్ సీఎం సార్ కార్యక్రమం'
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వేగంగా ప్రజల ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నారని రజని అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ పనుల కోసం ఎక్కడికో వెళ్ళకుండా సొంత ఊళ్లలోనే, వార్డులోనే సేవలు పొంది ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా, ఎక్కడా అవినీతికి తావు లేకుండా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇవీ చదవండి