ఈ నెల 31న ప్రారంభం కావాల్సిన పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంసెట్, ఐసెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువును పొడగించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు... తాజా నోటిఫికేషన్ త్వరలో వెల్లడించనున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
'పది' పరీక్షలపై కరోనా ప్రభావం - పరీక్షలు వాయిదా వార్తలు
కరోనా ప్రభావం దృష్ట్యా పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్‌పై... నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 31న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడించారు.
పదో తరగతి పరీక్షలు వాయిదా