గుంటూరు జిల్లా నరసరావుపేట వరవకట్టలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో వరవకట్ట 17వ వార్డులో మైనారిటీ ప్రజలకు కోడిగుడ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో అదే వార్డులోని వైకాపా శ్రేణులు తెదేపా నాయకులను అడ్డుకున్నారు. ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్దిచెప్పటంతో గొడవ సద్దుమణిగింది.
వరవకట్టలో ఉద్రిక్తత..తెదేపా-వైకాపాల మధ్య ఘర్షణ - వరవకట్టలో తెదేపా-వైకాపాల మధ్య ఘర్షణ
నరసరావుపేట వరవకట్టలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా ఆధ్వర్యంలో మైనార్టీలకు కోడి గుడ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టగా... వైకాపా కార్యకర్తలు అడ్డుతగిలారు. ఫలితంగా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
![వరవకట్టలో ఉద్రిక్తత..తెదేపా-వైకాపాల మధ్య ఘర్షణ fighting between ycp and tdp activists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9629311-804-9629311-1606058566493.jpg)
fighting between ycp and tdp activists