ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బతుకు పోరాటం: వ్యక్తి ఆత్మహత్యాయత్నం - బిల్డ్ ఏపీ వార్తలు

గుంటూరులోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విక్రయాలకు అనుమతి ఇవ్వట్లేదని వ్యాపారులు అందోళనకు దిగారు. ఓ వ్యాపారి పెట్రోల్ ఒంటిపై పోసుకోవటంతో తోటివాళ్లు అడ్డుకున్నారు. అధికారుల తీరుపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగొచ్చిన అధికారులు...మార్కెట్​లో విడతల వారీగా వ్యాపారాలకు అనుమతి ఇవ్వగా... ఆందోళన సద్దుమణిగింది.

Tension at PVK Naidu Vegetable Market in Guntur
గుంటూరులోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద ఉద్రిక్తత

By

Published : Oct 12, 2020, 12:23 PM IST

Updated : Oct 12, 2020, 9:23 PM IST

గుంటూరులోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. లాక్​డౌన్ సమయంలో మార్కెట్​లోని దుకాణాల్ని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. బిల్డ్ ఏపీలో భాగంగా... మార్కెట్​ను వేలానికి పెట్టారు. దీనిపై కొందరు హైకోర్టుని అశ్రయించారు. అయితే వ్యాపారుల ఆందోళను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బిల్డ్ ఏపీ నుంచి మార్కెట్ స్థలాన్ని మినహయించింది.

ఇపుడు లాక్​డౌన్ ఆంక్షలు తొలగిన తరుణంలో వ్యాపారులు కొందరు మార్కెట్లో దుకాణాలు ప్రారంభించారు. అయితే దుకాణాలు తెరిచేందుకు వీళ్లేదని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. అధికారులు, పోలీసుల వైఖరికి నిరసనగా వ్యాపారుల ఆందోళనకు దిగారు. ఎక్కడా లేని కరోనా నిబంధనలు గుంటూరు కూరగాయల మార్కెట్ కే ఎందుకని ప్రశ్నించారు. ఓ వ్యాపారి పెట్రోల్ ఒంటిపై పోసుకోవటంతో పక్కన ఉన్నవారు అప్రమత్తమయ్యారు. వెంటనే అతని నుంచి సీసా లాక్కున్నారు.

ఈ ఘటనతో ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా వ్యాపారులు నినాదాలు చేశారు. కొన్ని దశాబ్దాలుగా మార్కెట్ పై ఆధారపడి ఉన్న తమ జీవితాల్ని నాశనం చేయొద్దని వేడుకున్నారు. ఈ వ్యవహారంపై పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, హోంమంత్రి మేకతోటి సుచరిత అధికారులతో మాట్లాడారు. రోజూ 100 దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ... విడతల వారీగా దుకాణాలు నిర్వహించుకోవాలని సూచించారు. అధికారుల సూచనలతో వ్యాపారులు శాంతించారు.

గుంటూరులోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద ఉద్రిక్తత
ఇదీ చదవండి:పోలీసులపై వైకాపా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు
Last Updated : Oct 12, 2020, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details