రాజధాని పరిధిలోని మందడంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సచివాలయంలో జరిగే మంత్రిమండలి సమావేశానికి సీఎం హాజరుకానున్న నేపథ్యంలో... మందడంలో భారీగా పోలీసులు మోహరించారు. దుకాణాలను మూసి వేయించారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వస్తున్నందున దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాలని రైతులను ఆదేశించారు. ఇదే ప్రాంతంలో మూడు రాజధానులకు మద్దతుగా దీక్ష చేస్తున్న వారిని వదిలేసి.... తమను ఎందుకు ఖాళీ చేయమంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు
మందడంలో ఉద్రిక్త వాతావరణం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి మండలి సమావేశానికి హాజరుకానున్న నేపథ్యంలో మందడ దీక్ష శిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్తగా రైతులు దీక్ష శిబిరాలను ఖాళీ చేయాలని ఆదేశించారు.
మందడంలో ఉద్రిక్త వాతావరణం