కౌలు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం, బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేయాలంటూ కౌలు రైతుదారుల సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. గుంటూరు ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు కదలమంటూ.. బ్యాంక్‌ని ముట్టడి చేశారు. కౌలు రైతులందరికి ఋణ అర్హత కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నిసార్లు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని... న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు.
'కౌలు రైతులకు న్యాయం చేయాలి'
పంట రుణాలు మంజూరు చేయాలంటూ...గుంటూరులోని ఆంధ్రా బ్యాంకు కార్యాలయం ఎదుట కౌలు రైతులు నిరసన చేపట్టారు.
కౌలు రైతులకు న్యాయం చేయాలి