కౌలురైతు ధృవీకరణ పత్రంపై సంతకం చేయించుకుని వస్తే ఋణమిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బండారుపల్లి నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు కామినేని రామారావు తెలిపారు. కానీ అధికారులు మాత్రం సంతకాలు చేయకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. కౌలు రైతులు ఇప్పటికే పంటలకు పెట్టుబడులు పెట్టారని, దిగుబడులు వచ్చినా సరైన గిట్టుబాటు ధరలులేక పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందకపోతే వారికి ఆత్మహత్యలే శరణ్యమన్నారు.
నరసారావుపేటలో కౌలు రైతుల ఆందోళన - గుంటూరు జిల్లా రైతుసంఘం ప్రెసిడెంట్ కామినేని రామారావు
నరసారావుపేట వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట కౌలురైతులు సోమవారం ఆందోళనకు దిగారు. కౌలురైతు ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేసేందుకు అధికారులు కాలయాపన చేస్తున్నారంటూ మండలంలోని అల్లూరివారిపాలెం, ఇక్కుర్రు గ్రాలకు చెందిన వ్యవసాయశాఖ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.
![నరసారావుపేటలో కౌలు రైతుల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3981455-345-3981455-1564410700962.jpg)
వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట కౌలురైతులు ఆందోళన
TAGGED:
కౌలురైతులు