గుంటూరు జిల్లాలో నాగుల్ మీరా అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన నాగుల్ మీరా... నిమ్మతోటలు కౌలుకు తీసుకున్నాడు. అందుకోసం ఐదు లక్షల రూపాయలకు పైగా అప్పుచేశాడు. ఈ కరోనా లాక్ డౌన్ తో పాటు నిమ్మకు సరైన ధరలేని కారణంగా పెట్టుబడులు కూడా రాబట్టుకోలేకపోయాడు. దీంతో నాగుల్ మీరా అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీరాను గుంటూరు జీజీహెచ్ కు తరలించే లోగానే చనిపోయాడు.
చిలువూరులో కౌలురైతు ఆత్మహత్య - tenant farmer committed suicide in chiluvuru
అప్పుల బాధ తాళలేక గుంటూరు జిల్లాలో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు చేసి నిమ్మతోట సాగు చేసినప్పటికీ కరోనా ప్రభావంతో సరైన ధర లేక కనీసం పెట్టుబడి కూడా పొందలేకపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
చిలువూరులో కౌలురైతు ఆత్మహత్య
TAGGED:
చిలువూరులో కౌలురైతు ఆత్మహత్య