ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

IRON RIZING BULL: గొలుసుల లంకెలు.. సృజన రంకెలు

14 అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల ఎత్తులో ఇనుప గొలుసులుతో... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సూర్య శిల్పశాల శిల్పులు 'రైజింగ్ బుల్​'ను రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని ‘హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌’ కోసం దీన్ని తయారుచేశామని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర చెప్పారు.

tenali-surya-workshop-sculptors-made-iron-rising-bull
గొలుసుల లంకెలు.. సృజన రంకెలు

By

Published : Oct 10, 2021, 10:57 AM IST

Updated : Oct 10, 2021, 4:32 PM IST

ఇనుప గొలుసులతో 'రైజింగ్ బుల్'

వాడి పడేసిన పాత ఇనుప గొలుసులతో విగ్రహాలు ఆవిష్కరిస్తూ... తమ కళా ప్రతిభను నిరూపించుకుంటున్నారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సూర్య శిల్పశాల శిల్పులు. తెలంగాణకు చెందిన గ్రోత్ కారిడార్ సంస్థ ఇచ్చిన ఆర్డర్ మేరకు ఇనుప గొలుసులతో 'రైజింగ్ బుల్'ను రూపొందించినట్లు శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తెలిపారు.

"హైదరాబాద్​ గ్రోత్ కారిడార్ సంస్థ ఇచ్చిన ఆర్డర్ మేరకు ఇనుప గొలుసులతో 'రైజింగ్ బుల్'ను రూపొందించారు. త్వరలో వారికి ఇది అందజేస్తాం. ఇటీవలే ఇనుప నట్లతో ప్రధాని మోదీ, మహాత్మాగాంధీ విగ్రహాలను కూడా తయారు చేశాం."

-కాటూరి రవిచంద్ర, శిల్పి

రెండు టన్నుల ఐరన్‌ ఉపయోగించి ఎనిమిదడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పుతో ఈ బుల్‌ని తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైజింగ్‌ బుల్‌ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. త్వరలో ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేసి, ప్రదర్శనకు అవకాశమిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:Bharat Biotech: మలేరియాకు భారత్‌ బయోటెక్‌ టీకా.. జీఎస్‌కే భాగస్వామ్యంతో..

Last Updated : Oct 10, 2021, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details