జాతీయస్థాయి హ్యాండ్బాల్ జూనియర్ మహిళల విభాగం పోటీలకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన విద్యార్థిని ఎమ్.శివనాగజ్యోతి ఎంపికైంది. ఏప్రిల్ 2 నుంచి లఖ్నవూలో జరగనున్న జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొననుంది. శని, ఆదివారాల్లో ప్రకాశం జిల్లా కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో జరిగిన జూనియర్ హ్యాండ్బాల్ మహిళా విభాగంలో రాష్ట్రస్థాయిలో గెలుపొందడంతో ఆమె జాతీయస్థాయికి ఎంపికైంది.
జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు తెనాలి విద్యార్థిని ఎంపిక - tenali latest news
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివనాగజ్యోతి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. లఖ్నవూలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.
జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు తెనాలి విద్యార్థిని ఎంపిక
తమ కళాశాల తరఫున ఉత్తమ ప్రతిభ కనబరిచిన శివనాగజ్యోతిని కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.