12 pictures at a time: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దాసరి యశ్వంత్ అనే బీటెక్ విద్యార్థి.. ఒకేసారి 12 బొమ్మలను గీసి పలువురిని అబ్బురపరిచాడు. రెండు చేతులకు, రెండు కాళ్లకు కర్ర సాయంతో పెన్నులను అమర్చుకున్నాడు. ఒక్కొక్క కర్రకు మూడు పెన్నుల కొట్టాడు. ఒకేసారి కాళ్లు చేతులతో విభిన్న వ్యక్తుల 12 బొమ్మలు గీశాడు.
12 pictures at a time: ఔరా అనిపిస్తున్న తెనాలి చిన్నోడు!.. చేతులే కాదు.. కాళ్లతోనూ అద్భుతం!! - అబ్బురపరుస్తున్న తెనాలి విద్యార్థి
12 pictures at a time: సహజంగా ఆర్టిస్టు అంటే ఎన్నో ఏళ్ల తరబడి... చక్కటి బొమ్మలను చిత్రీకరిస్తేనే తగిన గుర్తింపు వస్తుంది. కానీ తెనాలికి చెందిన ఓ బీటెక్ విద్యార్థి తన ప్రత్యేక నైపుణ్యంతో.. తక్కువ సమయంలోనే ఎక్కువ బొమ్మలు గీసి అబ్బురపరుస్తున్నాడు. కర్రల సాయంతో కాళ్లు చేతులకు పెన్నులు కట్టుకుని.. ఒకే సారి 12 బొమ్మలను గీసి ఔరా..! అనిపించాడు. అసలు కాళ్లు చేతులకు పెన్నులు కట్టుకొని బొమ్మలు గీయడమేంటని అనుకుంటున్నారా? మీరే చూడండి.

12 pictures at a time
ఔరా అనిపిస్తున్న తెనాలి చిన్నోడు..
ఈ బొమ్మలను గీయడానికి మొత్తం గంటా 7 నిమిషాల 36 సెకన్ల సమయం పట్టినట్టు యశ్వంత్ పేర్కొన్నాడు. చిన్ననాటినుండే విభిన్నంగా చిత్రాలు గీయటం అంటే తనకెంతో ఆసక్తి అని తెలిపాడు యశ్వంత్.
ఇదీ చదవండి:మీకు తెలుసా..? శాస్త్రాలు మనుషులకే కాదు కోళ్లకూ ఉన్నాయి...!
Last Updated : Jan 7, 2022, 2:55 PM IST