ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలిలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన - vaccination to municipal workers

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటిలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. దుర్గాప్రసాద్ అనే కార్మికుడు కరోనా టీకా వికటించి మరణించాడని.. అతని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

tenali sanitary workers protest at government hospital
తెనాలిలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన

By

Published : Mar 3, 2021, 12:50 PM IST

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటిలో పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దుర్గాప్రసాద్ అనే కార్మికుడు మంగళవారం మరణించాడు. అతను ఇటీవలే కరోనా టీకా వేయించుకున్నారు. టీకా వికటించటం వల్లే దుర్గాప్రసాద్ మరణించాడని కార్మికులు అనుమానిస్తున్నారు.

దుర్గాప్రసాద్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. వ్యాక్సినేషన్​కు ముందు దుర్గాప్రసాద్ ఆరోగ్యంగానే ఉన్నారని... ఆ తర్వాతే మరణించారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి దుర్గాప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలని తోటి కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details