ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైకిల్​పై తిరుగుతూ.. సమస్యలు తెలుసుకుంటూ - సమస్యలు

ఎక్కడైనా ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు అధికారుల వద్దకు వెళతారు. కానీ ఓ అధికారి తానే ప్రజల వద్దకు వెళ్తున్నారు. సైకిల్​పై తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.

సైకిల్​పై తిరుగుతూ.. సమస్యలు తెలుసుకుంటూ.

By

Published : Jun 1, 2019, 12:36 PM IST

Updated : Jun 1, 2019, 5:09 PM IST

సైకిల్​పై తిరుగుతూ.. సమస్యలు తెలుసుకుంటూ

క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ కొత్త పంథా ఎంచుకున్నారు. ప్రతిరోజూ సైకిల్​పై వార్డుల్లో తిరుగుతూ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నారు. ఉదయం 6 గంటలకే సైకిల్​పై బయలుదేరి మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలు తెలుసుకుంటున్నారు. వాటిని తక్షణమే పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని తమ ఇబ్బందులు తెలియజేయాలని కమిషనర్ కోరారు.

Last Updated : Jun 1, 2019, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details