గుంటూరు జిల్లా తెనాలి శాసనసభ సభ్యులు అన్నాబత్తుని శివకుమార్.. కోవిడ్ టీకా మెుదటి డోస్‌ను స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకున్నారు. కోవిడ్ మహమ్మారి తెనాలిలో అధిక శాతంలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొన్నారు.
మహమ్మారిని అంతమొందించాలనే ఆలోచనతో ప్రతి సచివాలయంలోనూ ముఖ్యమంత్రి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో తీసుకొచ్చారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయట తిరగవద్దని... బయటకు వెళ్తే మాస్క్ ధరించి, శానిటైజర్‌ను ఉపయోగిస్తూ.. భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.