తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించి పూర్తిస్థాయిలో కొవిడ్ రోగులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఆయన... 8 రోజుల్లోనే కోలుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్యుల సహకారం, తన నియోజకవర్గ ప్రజల పూజలతో పూర్తిగా కోలుకున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి ఆసుపత్రి నుంచి డిప్యుటేషన్ పై వెళ్లిన వైద్యులను వెనక్కు పిలిపిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 60మందికి పైగా కొవిడ్ రోగులు తెనాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని... 200 మందికి సరిపడా ఆసుపత్రిని తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.
కరోనాను జయించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ - ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ న్యూస్
గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కరోనాను జయించారు. కరోనాతో పోరాడి 8 రోజుల్లోనే పూర్తి ఆరోగ్యవంతుడిగా డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల సహకారం, నియోజకవర్గ ప్రజల పూజలతో కోలుకున్నానని ఎమ్మెల్యే అన్నారు.
కరోనాను జయించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్