గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విభిన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసి, అర్హత పొందని వారితో ఆయన ముఖాముఖి నిర్వహించారు. పెదరావూరు పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన నాలుగు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. పథకాలకు వారు ఎందుకు అర్హత పొందలేదో... అధికారుల ద్వారా తెలుసుకుని వాటి పరిష్కారానికి దాఖలు చేయాల్సిన పత్రాలు, ఇతర సమాచారాన్ని లబ్ధిదారులకు తెలియచేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు లబ్ది పొందాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.
విభిన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెనాలి ఎమ్మెల్యే - tenali latest news
రాష్ట్రంలో ఒక విభిన్న కార్యక్రమానికి తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శ్రీకారం చుట్టారు. వివిధ ప్రభుత్వా పథకాలకు దరఖాస్తులు చేసి, అర్హత పొందని వారితో ఆయన ముఖాముఖి నిర్వహించారు.
![విభిన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెనాలి ఎమ్మెల్యే లబ్దిదారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9239395-516-9239395-1603155962056.jpg)
లబ్దిదారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే