ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాస్కుల నుంచి గ్లౌజుల వరకు మేమే కొనుక్కుంటున్నాం' - tenali nurses agitation update

ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు.. ఒక్క స్వీపర్ పని తప్ప మిగిలిన అన్ని పనులు మేమే చేస్తున్నాం.. కనీసం రోగులకు మంచి నీళ్లైనా ఇవ్వండి అంటూ నర్సులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.

nurse agitation
ఆందోళన చేస్తున్న సిబ్బంది

By

Published : Jul 25, 2020, 7:13 PM IST

ఆందోళన చేస్తున్న సిబ్బంది

ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకుండా కొవిడ్ ఆసుపత్రిగా ఎలా మార్చుతారని గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో నర్సింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. నర్సులు, వైద్య సిబ్బంది ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి కొవిడ్ విధులు నిర్వర్తిస్తున్నా... ప్రభుత్వం కనీసం పీపీఈ కిట్లు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కొవిడ్ విభాగంలో ఉండేవారికి మాత్రమే కిట్లు ఇవ్వాలన్న అధికారుల నిర్ణయం సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితిలో కరోనా ఎవరికి సోకిందో తెలియటం లేదనీ.. ఆసుపత్రిలో పని చేసే అందరికిీ వ్యక్తిగత రక్షణ కిట్లు, ఎన్95 మాస్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాంకేతిక సిబ్బంది లేక.. కరోనా అనుమానితుల నుంచి నమూనాలు తమతోనే తీయిస్తున్నారని వాపోయారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో రోగులకు సరైన సౌకర్యాలు లేవనీ.. బాధితులు కింద పడుతున్నారనీ... వారికి కనీసం మంచి నీళ్లైనా ఇవ్వండంటూ కోరారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ సనత్​కుమార్​కు వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details