ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాధారణ ప్రసవం కోసం వ్యాయామాలు - తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు వ్యాయమ తరగతులు

సుఖ ప్రసవం కావాలంటే గర్భిణులు తొమ్మిదో నెలలోకి అడుగుపెట్టిన మొదలు యోగ, ఫిజియోథెరఫీ... వంటి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సనత్ కుమారి పేర్కొన్నారు. ఈ క్రమంలో గర్భిణులకు సాధారణ కాన్పు కోసం వ్యాయామ కార్యక్రమం నిర్వహించారు.

yoga classes for pregnant womens
సాధారణ ప్రసవం కోసం వ్యాయమం అవసరం..

By

Published : Mar 9, 2021, 7:17 PM IST

Updated : Mar 9, 2021, 9:39 PM IST

సాధారణ ప్రసవం కోసం వ్యాయమం అవసరం..

సాధారణ ప్రసవం కోసం.. గర్భిణులు తప్పనిసరిగా వ్యాయామాలు చేయాలని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సనత్ కుమారి తెలిపారు. ఈ క్రమంలో గర్భిణులకు వ్యాయామంపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎక్కువమంది గర్భిణులకు సిజేరియన్ జరుగుతుందని.. ఈ ప్రక్రియను నివారించేందుకు వ్యాయామాలపై అవగాహన కల్పించామని సనత్ కుమారి పేర్కొన్నారు. మానసికంగా, శారీరకంగా సాధారణ కాన్పులకు వారిని సిద్ధం చేస్తున్నామన్నారు. తేలికపాటి వ్యాయామాలు చేయటం ద్వారా మానసిక సమస్యలను తగ్గించవచ్చని ఆమె తెలిపారు. వ్యాయామాల ద్వారా తల్లి, బిడ్డ సుఖప్రసవం జరుగుతుందని వివరించారు. వ్యాయామాలతో శిశువు కూడా ఆరోగ్యంగా జన్మిస్తుందని పేర్కొన్నారు.

గట్టి కండరాల వల్ల నార్మల్ డెలివరీ అవడం లేదని ఆ కండరాలు వదులు చేయటంతో సాధారణ కాన్పు జరుగుతుందన్నారు. ఆ దిశగా వారికి కండరాలపై అవగాహన కల్పించామని తెలిపారు. ఆశ వర్కర్ల ద్వారా గర్భిణుల ఇళ్ల దగ్గర వ్యాయామాలు చేసే విధంగా వారికి అవగాహన కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు. ఫిజియోథెరపిస్ట్ అపర్ణ ఈ వ్యాయామ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదీ చదవండీ..తరగతి గదిలో కళ్లు తిరిగి పడిపోయిన చిన్నారులు...

Last Updated : Mar 9, 2021, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details