గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ సేవలు పూర్తిస్థాయిలో అందించడానికి సిబ్బంది కొరత ఉందని.. వీలైనంత త్వరగా తమకు సిబ్బందిని అందించే విధంగా సబ్ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని నివేదించినట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సనత్ కుమారి వివరించారు. కొవిడ్ బాధితులకు మొదటి దశలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రెమిడీస్ వీర్ అనే ఇంజెక్షన్ బాగా పని చేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఇంజెక్షన్ తో పాటు డైక్లీ సైక్లిన్, పెరినారం వంటి ఇంజెక్షన్లు అందుబాటులో లేవన్నారు. అంతేకాక బి కాంప్లెక్స్, విటమిన్ సి, కాల్షియం, మల్టీ విటమిన్, తదితర మందులు అందుబాటులో లేవనీ.. మొదటి ప్రతిపాదనలో వాటిని నివేదించామని త్వరలోనే అందుబాటులోకి వస్తాయని సూపరింటెండెంట్ చెప్పారు.
'గ్రామీణులపైనే రెండో దశ పంజా.. సిబ్బంది కొరతపై సబ్ కలెక్టర్కు నివేదిచ్చాం' - తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తాజా వార్తలు
కొవిడ్ రెండో దశ వ్యాప్తి చెందుతున్న కారణంగా బాధితులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి సిబ్బంది కొరత ఉందని.. 45 మంది డాక్టర్లు, 55 మంది స్టాఫ్ నర్సులు, 65 ఎఫ్ఎంఓ, ఎంఎన్ఓ సిబ్బంది కావాలని సబ్ కలెక్టర్ కు నివేదించినట్లు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సనత్ కుమారి పేర్కొన్నారు.
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సనత్ కుమారి
కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేకంగా 220 బెడ్ లతో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రధానంగా రెండో దశ పల్లె ప్రజలపై వైరస్ ప్రభావం ఎక్కువగా చూపుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా గుంటూరు జిజిహెచ్, తెనాలి ఆసుపత్రిలో ఎక్కువ సదుపాయాలు కలిగి ఉన్నాయన్నారు.
ఇవీ చూడండి...:తెనాలిలో కారు బీభత్సం.. యూపీ వాసి మృతి