గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ చౌదరి కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు78 ఏళ్లు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... ఉదయం మరణించారు. రవీంద్రనాథ్ చౌదరి 1994లో తెదేపా తరపున పోటీ చేసి.. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుపై గెలుపొందారు. అంతకు ముందు రెండు పర్యాయాలు తెనాలి మున్సిపల్ ఛైర్మన్ గానూ పనిచేశారు.
1982-86 మధ్య కాలంలో స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్ గా గెలిచి, మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. 1987లో కాంగ్రెస్ తరపున కౌన్సిలర్ గా గెలిచి రెండోసారి మున్సిపల్ ఛైర్మన్ పదవి చేపట్టారు.