గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ వంతెన వద్ద జరిగిన హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీలక్ష్మి వివరించారు. పెద్ద వడ్లమూడిలో వీరిని తెనాలి త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు.ఈ నెల 7న తెనాలి మార్కెట్ ప్రాంతంలో వీరంశెట్టి కిషోర్ కుమార్‌పై శెట్టి నాని అతని అనుచరులు కత్తితో హత్య చేసేందుకు యత్నించారని అన్నారు. తీవ్రంగా గాయపడిన కిషోర్ కుమార్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, త్రీటౌన్ పోసలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని అన్నారు. వివాహేతర సంబంధం కారణంగా కిషోర్ కుమార్, శెట్టి నానిల మధ్య ఘర్షణ జరిగిందని, నాని స్నేహితులతో కలిసి కిషోర్‌ని చంపడానికి పథకం పన్నారని పోలీసులు తెలిపారు. ఈ నలుగురు నిందితులపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయని డీఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభచూపిన త్రీ టౌన్ సీఐ హరికృష్ణ, ఎస్సై విజయ్ కుమార్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ కేసులో గొట్టిముక్కల నవీన్ కుమార్ అనే వ్యక్తి వార్డ్ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
తెనాలిలో హత్యాయత్నం కేసు.. నలుగురి అరెస్టు - తెనాలి మార్కెట్ హత్యాయత్నం కేసులో నిందితులు అరెస్టు
గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ వంతెన వద్ద జరిగిన హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
![తెనాలిలో హత్యాయత్నం కేసు.. నలుగురి అరెస్టు tenali dsp srilakshmi press meet on tenali market murder](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8382358-465-8382358-1597161742990.jpg)
తెనాలి మార్కెట్ హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులు అరెస్టు