గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విశదలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కర్రలతో, రాళ్లతో దాడి చేసుకున్నారు. మసీదు విషయంలో వివాదం ఏర్పడగా.. సుమారు 10 మంది గాయపడ్డారు. సిబ్బందితో కలిసి సీఐ ఆనందరావు అక్కడకు చేరుకుని.. ఇరు వర్గాలతో మాట్లాడారు. కొత్తగా నిర్మిస్తున్న మసీదు స్లాబు పనులు నిలిపేశారు. ఈ చర్యను నిరసిస్తూ తమకు న్యాయం చేయాలని ఓ వర్గం రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టకేలకు స్లాబు పనులు యథావిధిగా తిరిగి మొదలు కావడంతో గొడవ సద్దుమణిగింది.
కర్రలు, రాళ్లతో ఇరువర్గాల దాడులు... 10 మందికి గాయాలు - విసదలలో సుమారు 10 మందికి గాయాలు
మసీదు నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో.. సుమారు 10 మందికి గాయాలయ్యాయి. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విశదలలో ఈ ఘటన జరిగింది. పోలీసుల రంగప్రవేశంతో ఎట్టకేలకు ఇరు వర్గాలు శాంతించాయి.
విశదలలో ఇరు వర్గాల వివాదం, మసీదు నిర్మాణంపై వివాదం
ఇరు వర్గాల మధ్య మసీదు విషయంలో గతంలోనే వివాదం నెలకొంది. ఓ వర్గం వారు మరో మసీదు నిర్మిస్తుండగా.. ఇంకొకరు అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాలు గొడవకు దిగారు. ఈ ఘటనలో షేక్ శిలారు అనే మహిళ సొమ్ముసిల్లి పడిపోవడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:అప్పు తీర్చమన్నందుకు సినీఫక్కీలో బావపై హత్యాయత్నం