నగల తయారీ దుకాణంలో చోరీ..రూ.10 లక్షలు అపహరణ - సత్తెనపల్లిలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో చోరీ
10:17 September 25
నగల తయారీ దుకాణంలో రూ.10 లక్షలు నగదు చోరీకి గురైనట్లు సమాచారం
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో చోరీ (theft in sattenapalli) జరిగింది. మున్సిపల్ కాంప్లెక్స్‌లోని నగల తయారీ దుకాణంలో అర్ధరాత్రి షటర్లు పగలగొట్టిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.10 లక్షలు చోరీకి గురైనట్లు సమాచారం. పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: CROCODILE DIED: రోడ్డుపైకి వచ్చింది..లారీ కింద పడింది