ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మళ్లీ తెరుచుకుంటున్న ఆలయాలు.. కానరాని భక్తులు

కరోనా రెండో వేవ్లో అత్యధికంగా కేసులు నమోదైన గుంటూరు జిల్లాలో.. ఆలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. కరోనా తగ్గినప్పటికీ భక్తులు ఆలయాలకు తక్కువ సంఖ్యలోనే వస్తున్నారని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో అంటున్నారు.

temples opened at guntur district
మళ్లీ తెరుచుకుంటున్న ఆలయాలు

By

Published : Jun 1, 2021, 3:38 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో మూతపడిన ఆలయాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి అధికారులు భక్తులకు అనుమతిచ్చారు.

కరోనా కేసులు పెరగడంతో ఏప్రిల్ 25 నుంచి ఆలయాన్ని మూసివేశారు. ఇన్ని రోజులూ స్వామివారి సేవలన్నీ అర్చకులే ఏకాంతంగా నిర్వహించారు. గత పది రోజులుగా మంగళగిరిలో కరోనా కేసులు తగ్గడంతో.. ఆలయాన్ని తిరిగి తెరిచేందుకు అనుమతిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా భయాలతో భక్తులు తక్కువ సంఖ్యలో వస్తున్నట్లు ఆలయ ఈవో పానకాలరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details