లాక్డౌన్ కారణంగా మూతపడిన ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భక్తులను థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల అనంతరమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. థర్మల్ స్క్రీనింగ్‌లో తేడాలు వచ్చిన వారిని ఇళ్లకు పంపిస్తున్నారు. ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పూజలకు అధికారులు అనుమతులు ఇవ్వటం లేదు. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తరలివస్తున్న భక్తులు - guntur dst temples opening news
గుళ్లో దేవుడి పాటలు...పొద్దున్నే చర్చిలో మోగే అలారం..మసీదుల్లో అల్లా ప్రార్థనలు విని చాలా రోజులైంది కదూ...కేంద్రప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ప్రార్థనా మందిరాలన్నీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి. జాగ్రత్తలు పాటిస్తూ భక్తులను అనుమతిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

temples opened in guntur dst mangalagri after so many day gap