ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాధాకృష్ణుడికి 8 టన్నుల పూలతో ఘనంగా పుష్పయాగం - ఉండవల్లి కరకట్టపై ఉన్న ఇస్కాన్ టెంపుల్లోని రాధాకృష్ణుడికి పుష్పయాగం న్యూస్

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్టపై ఉన్న ఇస్కాన్ టెంపుల్లోని రాధాకృష్ణుడికి 8 టన్నుల పూలతో పుష్పయాగం చేపట్టారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీకృష్ణ నామస్మరణతో సందడి చేశారు.

Temple officials held a grand puspha yagam for Radhakrishna in Undavalli, Guntur district
రాధాకృష్ణుడికి 8 టన్నుల పూలతో ఘనంగా పుష్పయాగం

By

Published : Feb 16, 2021, 8:16 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్టపై ఉన్న ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణుడికి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్ ప్రారంభించి 19 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆలయంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. గోపూజ అనంతరం.. శ్రీరాధాకృష్ణుడికి 8 రకాల పూలతో యాగం చేశారు. అందుకోసం సుమారు 8 టన్నుల పూలను ఉపయోగించారు. రాధా కృష్ణడితో పాటు.. అక్కడున్న జగన్నాథ స్వామికి పుష్పయాగం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలు: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details