ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాత్కాలిక వైద్య సిబ్బంది విధుల్లోకి తీసుకోవాలి: తెదేపా - ఆంధ్రప్రదేశ్ వార్తలు

తాత్కాలిక వైద్య ఆరోగ్య సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ చేపడుతున్న ఆందోళన కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలతో పాటుగా పాల్గొన్నారు.

telugudesham party leaders demand for temporary medical personnel should be hired
తాత్కాలిక వైద్య సిబ్బంది విధుల్లోకి తీసుకోవాలి: తెదేపా

By

Published : Feb 9, 2021, 6:16 PM IST

కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో విశేష సేవలందించిన వైద్య ఆరోగ్య సిబ్బందిని విధుల నుంచి తొలగించడం సరికాదని తెదేపా నేతలు అన్నారు. ఈ మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. గుంటూరు జిల్లా జీజీహెచ్ ఎదుట చేపడుతోన్న ఆందోళన కార్యక్రమంలో తాత్కాలిక వైద్య సిబ్బందితో కలిసి పాల్గొన్నారు.

తాత్కాలిక వైద్య ఆరోగ్య సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details