అత్యాచారం జరిగి వారం రోజులు దాటుతున్నా ఇంతవరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని తాడేపల్లిలో తెలుగుదేశం పార్టీనేతలు ధర్నా చేశారు. సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే.. అత్యాచారం జరిగితే ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఏదైనా ఆపద వస్తే గన్ కన్నా వేగంగా వస్తాననడం అంటే ఇదేనా అని సీఎం జగన్ను తెదెేపా మహిళా నేతలు నిలదీశారు.
'గన్ కంటే వేగంగా వస్తానన్న సీఎం జగన్ ఎక్కడ?' - టీడీపీ
గుంటూరు జిల్లాలో కలకలం సృష్టించిన అత్యాచార ఘటనపై తాడేపల్లిలో తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నా చేశారు. అత్యాచారం జరిగి వారం రోజులు గడుస్తున్నా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని సీఎంను ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీనేతల ధర్నా
ఇటీవల గుంటూరు జిల్లా సీతానగరంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది.
ఇదీ చదవండి:TADEPALLI RAPE CASE: 'అత్యాచార నిందితులను త్వరలోనే పట్టుకుంటాం'