ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొలి రోజు మహానాడులో అధికంగా పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు - telugdesam party mahanadu latest news

తెలుగుదేశం పార్టీ పసుపు పండగ.. మహానాడును పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జూమ్ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ ఆన్ లైన్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించటం ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కింది. తొలుత పార్టీ కోసం పనిచేసి ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలకు నివాళులర్పించారు.

telugudesam party conduct online mahanadu programme all over the state
telugudesam party conduct online mahanadu programme all over the state

By

Published : May 27, 2020, 6:39 PM IST

తెదేపా మహానాడులో కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు ఆన్​లైన్​లో పాల్గొన్నారు. తమ తమ నివాసాలు, జిల్లా పార్టీ కార్యాలయాల నుంచే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విశాఖ జిల్లాలో...

విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ తెదేపా నాయకులు ఆన్​లైన్​ మహానాడులో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనకాపల్లి నియోజకవర్గంలో 1380 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని అనకాపల్లిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

తెదేపా అర్బన్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్​కుమార్ ఆధ్వర్యంలో విశాఖలో తెదేపా నాయకులు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీ రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని తీర్మానం చేశామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఎల్జీ పాలీమర్స్ పై మరొక తీర్మానం చేశామని అన్నారు. న్యాయ వ్యవస్థను వైకాపా నేతలు హేళన చేస్తున్నారని.. ఇది సరి కాదని అన్నారు

తూర్పుగోదావరి జిల్లాలో

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా నాయకులు మహానాడు కార్యక్రమం వీక్షించేలా ప్రత్తిపాడులోని వరుపుల రాజా స్వగృహంలో ఏర్పాట్లు చేశారు.. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లాలో

నెల్లూరు నుంచే తెదేపా జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తోపాటు ఇతర నాయకులు ఆన్​లైన్​ మహానాడులో పాల్గొన్నారు.

గుంటూరు జిల్లాలో

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో 120 మంది పార్టీ నాయకులు మహానాడులో పాల్గొన్నారు.

అనంతపురం జిల్లాలో

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆన్​లైన్​ మహానాడులో ఉత్సాహంగా పాల్గొన్నారు.

విజయనగరం జిల్లాలో

ఆన్​లైన్​ మహానాడు కార్యక్రమంలో విజయనగరం జిల్లా తెదేపా సాలూరు నియోజకవర్గం ఇన్​ఛార్జ్​ ఆర్​పీ భానూజీదేవ్ ఆధ్వర్యంలో నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ తెదేపా హయాంలో అమలైన పలు సంక్షేమ పథకాలకు పేర్లు మార్చటం తప్ప ఏడాదిలో వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. సాలూరులో పార్టీ బలోపేతానికి శ్రేణులంతా ఐకమత్యంతో శ్రమించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండివిధ్వంసం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా..?

ABOUT THE AUTHOR

...view details