Ravipati Sai Krishna: గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ సీఐడీ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరయ్యారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న అభియోగంపై సీఐడీ అధికారులు సాయికృష్ణకు 41ఏ నోటీసులు అందించారు. ఇప్పటికే మంగళగిరి డీజీపీ కార్యాలయంలో సీఐడీ అధికారులు సాయికృష్ణను విచారించారు. గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి రావాలని మరోసారి నోటీసులు ఇవ్వడంతో.. ఆయన విచారణకు హాజరయ్యారు. అంతకుముందు సాయికృష్ణకు మద్ధతుగా పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ర్యాలీగా వచ్చారు. కొందరు రహదారిపై బైఠాయించగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నారని సాయికృష్ణ అన్నారు.
మరోసారి సీఐడీ విచారణకు రావిపాటి సాయికృష్ణ - నోటిసులు
Ravipati Sai Krishna: గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే సీఐడీ అధికారులు విచారించగా.. మళ్లీ హాజరుకావాలని నోటీసులు ఇవ్వటంతో ఆయన సీఐడీ ఎదుట మరోసారి హాజరయ్యారు.

Etv Bharat
మరోసారి సీఐడీ విచారణకు రావిపాటి సాయికృష్ణ