కరోనా ఎఫెక్ట్: ఇటలీలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు - Telugu students stuck in Italy
తెలుగు విద్యార్థులు కరోనా కారణంగా ఇటలీలో చిక్కుకున్నారు. వీరికి భారత్ వచ్చేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం కారణంగా అక్కడి వారెవరినీ ఇతర ప్రాంతాలకు వెళ్లనీయటంలేదని విద్యార్థులు వాపోయారు. స్వదేశానికి వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్నా... విమాన సర్వీసులూ రద్దు చేశారని చెప్పారు. కనీసం మాస్కులు కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా ఎఫెక్ట్: ఇటలీలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు