ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు భాషాభివృద్ధి కోసం... వినూత్న కార్యక్రమం! - తెలుగు సాహితి బాల కార్యక్రమం

తెలుగు భాష మీద చిన్నారులకు పట్టు రావడం కోసం గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కమిషనర్ నూతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు పద్యాలు, కవితల గురించి నేటితరానికి నేర్పుతామని తెలిపారు.

తెలుగు పద్యాలు, కవితల గురించి

By

Published : May 5, 2019, 8:27 AM IST

తెలుగు సాహితి బాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెనాలి మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ

తెలుగు భాష మాధుర్యాన్ని నేటితరం తెలుసుకునేందుకు.... తెలుగు సాహితి బాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ అన్నారు. ప్రస్తుత తరం తెలుగు మీద పట్టు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యార్థిని, విద్యార్థులకు తెలుగు పద్యాలు, కవితల గురించి ప్రతి రోజు సాయంత్రం.. నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. కోర్సు అనంతరం పరీక్ష నిర్వహించి తెలుగు సాహితి బాల పురస్కారాన్ని అందిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details