ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పసుపు పంటను రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి' - పసుపుని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి

పసుపుని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా రేవేంద్రపాడులో పసుపు సాగును ఆయన పరిశీలించారు.

turmeric buying at rythu bharosa centres
పసుపుని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి

By

Published : Mar 20, 2021, 2:17 PM IST

ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పసుపును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో పసుపు సాగును పరిశీలించారు. ఈసందర్భంగా.. పంట సాగులో ఎదురవుతున్న సమస్యలను రైతులు వివరించారు.

పసుపు పంట దిగుబడి తగ్గటం, ధరలు పడిపోవటంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వమే రైతును ఆదుకోవాలని.. పసుపు పంటను రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details