ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెగులుతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి' - guntur district latest news

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం సొలస గ్రామంలో వైరస్ తెగులుతో ఎండిపోయిన మిరప తోటలను తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. వందల ఎకరాల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Telugu farmer state president Mareddy Srinivasareddy observe chilli crop in  guntur district
తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డి

By

Published : Mar 20, 2021, 3:28 PM IST

తెగులుతో మిర్చి పంట దెబ్బతిని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని తెలుగు రైతు రాష్ట్ర అధ్య‌క్షుడు మారెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం సొలస గ్రామంలో తెగులుతో ఎండిపోయిన పొలాలను ఆయన పరిశీలించారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన మిర్చి రైతులు... తెగులు కారణంగా తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెగులు వ్యాధి సోకి సొలస, చిరుమామిళ్ళ, లింగారావుపాలెం, సంక్రాంతిపాడు గ్రామాల్లో 500 ఎకరాల వరకు మిర్చి పంట దెబ్బతిన్నట్టు చెప్పారు. ఈ పంటలను అధికారులు పరిశీలించి, బాధిత రైతులకు పరిహారం అందించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details