గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని రాయవరం జంక్షన్ వద్ద రూరల్ ఎస్సై ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం సీసాలను పట్టుకున్నారు. వారికి వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీలు చేస్తుండగా కంభంపాడు వైపు నుంచి రాయవరం వైపు వస్తున్న బైకులో 52 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులు రాయవరం గ్రామానికి చెందిన సూరె శ్రీనివాసరావు గౌడ్ (47), మక్కెన హనుమంతరావు (37) అని తెలిపారు.
తెలంగాణ మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్టు
గుంటూరు జిల్లాలోని మాచర్లలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.
తెలంగాణ మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్టు