గుంటూరు గ్రామీణ పోలీసులు పెద్దఎత్తున తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నారు. అచ్చంపేట మండలం గింజుపల్లి వద్ద 4,236 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పడవలో తెలంగాణ మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. సత్తెనపల్లిలో ఆటోలో తరలిస్తున్న 743 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని వెల్లడించారు.
పడవలో తెలంగాణ మద్యం రవాణా... పట్టుకున్న పోలీసులు
గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసులు అక్రమ రవాణా చేస్తున్న వారిపై వరస దాడులు చేశారు. అచ్చంపేట మండలంలో పోలీసులుపడవలో తరలిస్తున్న తెలంగాణ మద్యం సీసాలను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసిన్నట్లు తెలిపారు.
4,236 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
అక్రమ ఇసుక, మద్యం రవాణాపై నిరంతర నిఘా ఉంటుందని.. అక్రమ రవాణాపై ప్రజలు సమాచారం అందించాలని గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని పిలుపునిచ్చారు. మద్యం అక్రమ రవాణాకు సంభందించి పులువురిని అరెస్టు చేశామని.. తెలంగాణలో సరకు విక్రయిస్తున్న మద్యం దుకాణదారులపైన కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండిపేకాట శిబిరం వ్యవహారంతో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే శ్రీదేవి