గుంటూరు జిల్లా నరసరావుపేటలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యంను పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని వినుకొండ రోడ్డులో భారత్ పెట్రోల్ బంక్ వద్ద కారులో ఈ మద్యాన్ని నిల్వఉంచారు. సమాచారం అందడంతో నరసరావుపేట ఎక్సైజ్ పోలీసులు వీటిని గుర్తించారు. కారులో 416 క్వార్టర్ బాటిళ్లు, 21 ఫుల్ బాటిళ్లను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 50వేల నగదు స్వాధీనం చేసుకునారు. కారును సీజ్ చేశారు. నిందితుల్లో షేక్ జానీ, సరమళ్ల పాపయ్య, మేకల కాటం రాజు, నూకల నాగేంద్రబాబు, చల్లా రామాంజనేయులు, ఉసా నాగేంద్రబాబును అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
నరసరావుపేటలో తెలంగాణ మద్యం పట్టివేత - నరసరావుపేటలో తెలంగాణ మద్యం పట్టివేత
కారులో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు నరసరావుపేటలో పట్టుకున్నారు. కారులో 437 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
telangana wine