గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని అడ్డరోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని నకరికల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో అడ్డరోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బొలెరో మాక్స్ వాహనంలో లక్షన్నర విలువ చేసే 84 ఫుల్ బాటిల్లు, 504 క్వార్టర్ బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నకరికల్లు ఎస్ఐ ఉదయ్ బాబు వెల్లడించారు.
నకరికల్లులో తెలంగాణ మద్యం పట్టివేత - Telangana liquor at guntur district news
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో నకరికల్లు మండలంలోని అడ్డరోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పోలీసులు లక్షన్నర విలువచేసే మద్యాన్ని స్వాధీనం చేసుకొని, వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
నకరికల్లులో తెలంగాణ మద్యం పట్టివేత